ధర్మారం: మల్లాపూర్, పైడిచింతలపల్లి గ్రామాలలో సర్వే నిర్వహించిన కేంద్ర బృందం, పాల్గొన్న మండల అధికారులు
స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ-2025లో భాగంగా ధర్మారం మండలం మల్లాపూర్, పైడిచింతలపల్లి గ్రామాలలో కేంద్ర బృందం స్వచ్ఛభారత్, పారిశుద్ధ్య అంశాలపై సోమవారం సర్వే నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ధర్మారం ఎంపీడీవో ఐనాల ప్రవీణ్ కుమార్, ఎంపీవో రమేశ్, స్వచ్ఛ భారత్ సమన్వయకర్తలు రాఘవులు, రేణుక, పంచాయతీ కార్యదర్శి సతీష్, జీపీ సమన్వయకర్తలు, స్వశక్తి మహిళలు తదితరులు పాల్గొన్నారు.