సంతనూతలపాడు మండలంలోని కొనగాని వారి పాలెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సంతనూతలపాడు ఎంపీడీవో సురేష్ బాబు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ఎంపీడీవో పరిశీలించారు. విద్యార్థులతో కలిసి ఆయన స్వయంగా భోజనం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని పాఠశాలల్లో అమలు చేస్తుందన్నారు. మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తప్పవని ఎంపీడీవో హెచ్చరించారు.