ములుగు: ఏటూరునాగారం తహశీల్దార్ కార్యాలయం ముట్టడించిన వికలాంగుల హక్కుల పోరాట సమితి
Mulug, Mulugu | Sep 15, 2025 కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం వెంటనే నూతన పెన్షన్లు అమలు చేయాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో సోమవారం మధ్యాహ్నం ఏటూరునాగారంలో ర్యాలీ, తాసిల్దార్ కార్యాలయం ముట్టడి చేపట్టారు. ఆ సంఘం జాతీయ నేత నరసయ్య మాదిగ మాట్లాడుతూ.. వికలాంగులకు రూ. 6 వేలు, చేయూత రూ.4 వేలు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. లేనియెడల ఈనెల 20న ప్రతి గ్రామపంచాయతీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.