అనంతపురం జిల్లా కుందుర్పి మండలం మల్లాపురం తండాలో గురువారం సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో ఉదయ్ అనే వ్యక్తి కుటుంబ సమస్యలతో బాధపడుతూ ఇంటిలోనే పురుగులు మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే అది గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన మెరిగైన చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఉదయ్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం విషమంగానే ఉన్నదని వైద్యుల శ్రీనివాస నాయక్ తెలిపారు.