నెల్లిమర్ల: విజయనగరం జిల్లాలో ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ: పార్లమెంటు స్థానానికి ఒకటి, అసెంబ్లీ స్థానాలకు 10 నామినేషన్లు దాఖలు
విజయనగరం జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమయ్యింది. తొలిరోజు గురువారం విజయనగరం పార్లమెంటు స్థానానికి రెండు, జిల్లాలోని ఏడు అసెంబ్లీ స్థానాలకు 10 నామినేషన్లు దాఖలయ్యాయి. మొదటిరోజు నామినేషన్ల ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా పూర్తయ్యింది. ఆర్ఓ కార్యాలయాలకు వంద మీటర్ల దూరంలోనే, పోలీసులు అభ్యర్ధుల వాహనాలను నిలిపివేశారు. అభ్యర్ధితో సహా ఐదుగురిని మాత్రమే ఆర్ఓ కార్యాలయాల లోపలికి అనుమతించారు. అన్ని ఆర్ఓ కార్యాలయాల్లో సిసి కెమేరాలను ఏర్పాటు చేశారు. సిసి కెమేరాల నిఘా మధ్య నామినేషన్ల ప్రక్రియ నిర్వహించారు.