అసిఫాబాద్: ఆసిఫాబాద్లో రైతుల ధర్నా, పోలీసుల రైతుల మధ్య స్వల్ప తోపులాట
కేంద్ర ప్రభుత్వం పత్తి రైతుల జీవితాలను కష్టాల పాలు చేస్తుందని.. తేమ శాతంతో పాటు కొత్తగా కాపాస్ కిసాన్ ఆప్తో సమస్యలకు తెర లేపిందని పత్తి రైతులు ఆందోళన బాటపట్టారు. శనివారం ASF కలెక్టరేట్ ఎదుట చేపట్టిన ర్యాలీలో రైతులు కలెక్టరేట్ గేటును దొబ్బి లోపలికి చొచ్చుకుపోయే ప్రయత్నం చేశారు. పోలీసులు రైతులను లోపలికి పోకుండా అడ్డుకున్నారు. దీంతో పోలీసుల, రైతుల మధ్య స్వల్ప తోపులాట జరిగింది.