శ్రీ సత్య సాయి జిల్లా కదిరి నియోజకవర్గం గాండ్లపెంటకు చెందిన ఓ మైనర్ బాలిక అదృశ్యం అయిన కేసును పోలీసులు చేదించి బాలికను కుటుంబ సభ్యులకు గురువారం అప్పజెప్పారు. గాండ్లపెంటకు చెందిన మైనర్ బాలిక అనంతపురంలోని ఆర్టీసీ బస్టాండ్ లో సంచరిస్తుండగా పోలీసులు గుర్తించి ఆరా తీయగా గాండ్లపెంటకు చెందిన బాలికగా గుర్తించారు. దీంతో కుటుంబ సభ్యులకు బాలికను అప్పజెప్పారు.