జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవితపైన కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చేసిన వ్యాఖ్యలను జాగృతి నేతలు ఖండించారు. మూసాపేట్ వై జంక్షన్ లోని హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఒక వ్యక్తిని కానీ, ఒక పార్టీని కానీ టార్గెట్గా చేసుకొని మాట్లాడే వ్యక్తి కాదని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సమస్యలను మాత్రమే కవితా ప్రస్తావించారని అన్నారు. ఇలా ఒక మహిళ ఎమ్మెల్సీ ని పట్టుకొని మాట్లాడడం తగదన్నారు.