కనిగిరి: పట్టణంలో గంజాయి విక్రయించే అనుమానిత వ్యక్తుల ఇళ్లలో పోలీసుల తనిఖీలు, 5 ఆటోలు,10 బైకులు సీజ్
కనిగిరి పట్టణంలోని కాశిరెడ్డి కాలనీ, దొరవు బజార్ ప్రాంతాలలో గంజాయి విక్రయాలు సాగించే అనుమానిత వ్యక్తుల ఇళ్లలో కనిగిరి సీఐ ఉప్పు శ్రీనివాసరావు, పెద్ద చెర్లోపల్లి ఎస్సై కోటయ్య సర్కిల్ పరిధిలోని పోలీస్ సిబ్బందితో కలిసి సోమవారం విస్తృతంగా తనిఖీలను చేపట్టారు. ఈ సందర్భంగా ఎటువంటి ధృవపత్రాలు లేని 5 ఆటోలు, 10 బైకులను సీఐ శ్రీనివాసరావు సీట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంజాయి విక్రయించే అనుమానిత వ్యక్తుల ఇళ్లలో సోదాలు నిర్వహించడం జరిగిందని, అక్రమంగా గంజాయి కలిగి ఉన్న, గంజాయి విక్రయాలను సాగించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.