అసిఫాబాద్: తల సేమియా,సికిల్ సెల్ వ్యాధిగ్రస్తులకు పెన్షన్ ఇవ్వాలి
తల సేమియా సికిల్ సెల్ వ్యాధిగ్రస్తులకు సదరం సర్టిఫికెట్ వచ్చిన వారందరికీ వికలాంగుల పెన్షన్ ఇవ్వాలని, సదరం క్యాంపులు రెగ్యులర్ గా నిర్వహించాలని ASF కలెక్టరేట్ ఎదుట తలసేమియా, సికిల్ సెల్ వ్యాధిగ్రస్తులు నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ.. సికిల్ సెల్ వ్యాధిగ్రస్తులు,చిన్న పిల్లలు మంచిర్యాల కు వెళ్లి రక్తం ఇక్కిస్తున్నారని,వారికి ASF లోనే ఏర్పాట్లు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. పిల్లలకు కార్పొరేట్ లో ఉచిత విద్యను అందించాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు.