జన్నారం: తిమ్మాపూర్ రైతు వేదిక వద్ద యూరియా కోసం రైతులు ఆందోళన వ్యక్తం
జన్నారం మండలం తిమ్మాపూర్ రైతు వేదిక వద్ద యూరియా బస్తాల కోసం రైతులు బుధవారం తెల్లవారుజాము నుంచే పడిగాపులు కాస్తున్నారు. మంగళవారం యూరియా బస్తాలు వచ్చినప్పటికీ వాటిని రైతు వేదికలో ఉంచి, ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని రైతులు రైతు వేదిక వద్ద ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వచ్చిన యూరియా బస్తాలను సకాలంలో పంపిణీ చేసి రైతులకు సహకరించాలని వ్యవసాయ శాఖ అధికారులను కోరుతున్నారు. పంటలు పొట్టకు వచ్చాయని యూరియా కొరత లేకుండా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.