పెదచెర్లోపల్లి మండలంలోని మురుగమ్మి గ్రామంలో రూ.4 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న 33/11 కెవి విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణానికి సంబంధించి భూమి పూజ కార్యక్రమాన్ని మంగళవారం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కనిగిరి ఎమ్మెల్యే ముక్కు నరసింహారెడ్డి తో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.... రాష్ట్రంలో రైతులు మరియు విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తును ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అందజేస్తుందన్నారు. విద్యుత్ లో వోల్టేజి సమస్యలు తలెత్తకుండా సబ్స్టేషన్ల నిర్మాణం తో పాటు అదనపు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.