ఖానాపూర్: భారీ వర్షాలకు పంట కొట్టుకు పోయిందని ఓ రైతు పురుగుల మందు సేవించి ఆత్మహత్య
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంట కొట్టుకుపోవడంతో మనస్థాపం చెంది ఓ రైతు పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పెంబి మండలంలో చోటుచేసుకుంది. బుదవారం పోలీసుల వివరాల ప్రకారం మందపల్లి గ్రామానికి చెందిన పెద్దులు అనే రైతు తన రెండెకరాల పత్తి,పసుపు పంటలు సాగుచేయగ వర్షాల వల్ల పంట కొట్టుకు పోవడంతో మనస్థాపం చెంది పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడగ కుటుంబీకులు నిర్మల్ ఆసుపత్రికి తరలించి చికిత్సలు అందిస్తుండగ చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుని కుటుంబ సభ్యుల పిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేపట్టామన్నారు.