ధర్మపురి: బాల్య వివాహాల నిర్మూలన పై చర్చిల్లో అవగహన కార్యక్రమాలు...
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం ముంజంపల్లి తోపాటు శానబండ గ్రామాల్లోని చర్చిలలో ఆదివారం రోజున బాల్య వివాహాల నిర్మూలన పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్స్ అనే ఎన్జీవో సంస్థ అద్వర్యంలో ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేసారు.బాల్య వివాహాలు వల్ల కలిగే అనర్థాలపై అవగహన కల్పించారు. జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్స్ ఎన్జీవో సంస్థ ప్రతినిథి కడారి లతా మాట్లాడుతూ. బాల్య వివాహాల నిరోధక చట్టం- 2006 ప్రకారం 18 సంవత్సరాల లోపు అమ్మాయికి 21 సంవత్సరంలోపు అబ్బాయికి వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని తెలిపారు.