మేడ్చల్: రామంతపూర్ లక్ష్మీనారాయణ కాలనీలో పర్యటించిన ఉప్పల్ కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి
ఉప్పల్ డివిజన్లోని రామంతపూర్ లక్ష్మీనారాయణ కాలనీలో అసోసియేషన్ ప్రతినిధులతో కలిసి కాలనీలో ఉప్పల కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి పర్యటించి, సమస్యలు తెలుసుకున్నారు. కాలనీలో సిసి రోడ్ల నిర్మాణం చేపట్టాలని రజిత పరమేశ్వర్ రెడ్డిని కాలనీవాసులు కోరారు. దీంతోపాటు డ్రైనేజీ సమస్య కూడా తీవ్రంగా ఉందనే విషయాన్ని వారి దృష్టికి తీసుకువచ్చారు. లక్ష్మీనారాయణ కాలనీలో డ్రైనేజీ సమస్య శాశ్వత పరిష్కారానికి అతిత్వరలో పనులు ప్రారంభమవుతాయని కార్పొరేటర్ తెలిపారు. కాలనీలో సిసి రోడ్డు తో పాటు డ్రైనేజీ సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలను చేపట్టనున్నట్టుగా కాలనీవాసులకు హామీ ఇచ్చారు.