మచిలీపట్నం: జిల్లా సమీక్షా మండలి సమావేశంలో ఇరిగేషన్ ఎస్ఈ పై మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం
జిల్లా సమీక్షా మండలి సమావేశంలో ఇరిగేషన్ ఎస్ఈ పై మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం స్తానిక మచిలీపట్నంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో జరిగిన జిల్లా సమీక్షా మండలి సమావేశంలో గురువారం మద్యాహ్నం రెండు గంటల సమయంలొ పాల్గొన్న రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ఇరిగేషన్ ఎస్ఈ పనితీరు పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో కూర్చుంటే సరిపోదని, ఏ ఒక్క రోజైనా క్షేత్ర పర్యటన చేసి కాలువ గట్ల మీద తిరిగారా.?అంటూ ప్రశ్నించారు. కలెక్టరే మచిలీపట్నంలో ఉంటుంటే మీరు విజయవాడలో ఎలా ఉంటారన్నారని ప్రశ్నించారు. కాలువల్లో పూడికలు తీయకపోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోవల్సి వస్తుందన్నారు.