ధర్మారం: చెల్లెలు ఇంటికి వచ్చి కానరాని లోకాలకు, విద్యుత్ షాక్ తగిలి ధర్మారంలో వ్యక్తి మృతి
ధర్మారంలో విద్యుత్ షాక్ తగిలి ఓ వ్యక్తి మృతి చెందాడు. మంచిర్యాలకు చెందిన పస్తం చంద్రయ్య అనే వ్యక్తి ధర్మారంలో ఉంటున్న తన చెల్లెలు పర్వతం మమత ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో సోమవారం ఉదయం 10:30 గంటల ప్రాంతంలో ఇంటి ముందు ఉన్న మర్రి చెట్టు వద్ద ప్రమాదవశాత్తు కరెంటు షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి కొడుకు నరేష్ దరఖాస్తుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.