సూళ్లూరుపేటలో ప్లాస్టిక్ నిల్వలపై మున్సిపల్ అధికారులు ఉక్కుపాదం
-ప్లాస్టిక్ కవర్లు వినియోగంపై మున్సిపల్ కమిషనర్ చిన్నయ్య
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలో పలు దుకాణాలను మున్సిపల్ కమిషనర్ కె.చిన్నయ్య సిబ్బందితో కలిసి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ దాడులలో 30 కేజీలు ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు స్వాధీనం చేసుకొని ₹1700/- జరిమానా విధించారు. ఈ సందర్భంగా కమిషనర్ చిన్నయ్య మాట్లాడుతూ దుకాణదారులు సింగల్ యూస్ ప్లాస్టిక్ వాడకం తగ్గించాలని వాటి స్థానంలో జ్యూట్ లేదా గుడ్డ సంచులు వాడాలని తెలిపారు. లేనిచో వారిపై నోటీసులు జారీ చేసి, భారీ జరిమానాతో పాటు వారి ట్రేడ్ లైసెన్స్ రద్దుచేసి షాప్ సీజ్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శానిటరీ సెక్రటర్లు, శానిటరీ మేస్త్రీలు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్