సీఎం చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం కండువాలు కప్పుకున్న ముగ్గురు వైసీపీ ఎమ్మెల్సీలు
వైసిపి చెందిన ముగ్గురు ఎమ్మెల్సీలు మర్రి రాజశేఖర్, కళ్యాణ చక్రవర్తి, పద్మశ్రీ శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయంలో సీఎం క్యాంపు కార్యాలయంలో వైసీపీని వీడి తెలుగుదేశం కండువాలు కప్పుకున్నారు. వీరికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.