పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుచిత్ర సిగ్నల్ వద్ద 82, 83 సర్వే నెంబర్ల భూములపై ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి మల్లారెడ్డి, బిఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కి చెందిన భూమిని కాంగ్రెస్ నాయకులు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మల్లారెడ్డి గతంలో కోర్టులో కేసు దాఖలు చేశారు. అదే సర్వే నెంబర్లలో శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు చేయడంతో రెవెన్యూ అధికారులు సర్వే చేపట్టారు.