అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం పొబ్బెర్లపల్లి లో శుక్రవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో కులం హద్దుల కోసం రెండు కుటుంబాల మధ్య ఘర్షణ. ఘర్షణలో పవన్ కళ్యాణ్, తల్లి అక్కమ్మకు తీవ్ర గాయలవడంతో హుటాహుటిన మెరుగైన చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అక్కమ్మకు చెయ్యి విరిగినదని అత్యవసరవి భాగం వైద్యులు డాక్టర్ రామాంజనేయులు తెలిపారు.