వెంకటగిరిలో శ్రీ పోలేరమ్మ ఆర్చి కి భూమి పూజ.
తిరుపతి జిల్లా, వెంకటగిరి పట్టణంలోని పాలకేంద్రం సెంటర్ వద్ద కోన వెంకటేశ్వరరావు, సర్వేపల్లి విజయ శేఖర్ లు పోలేరమ్మ ఆర్చి నిర్మాణాని కి టీడీపీ నాయకులతో కలసి భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ.. ప్రజలను కూడా వెంకటగిరి అభివృద్ధిలో భాగస్వాములను చేయాలనే ఆలోచనతో ఎమ్మెల్యే వీరికి అవకాశం కలిగించారని తెలిపారు. మంచి కార్యక్రమాలు చేయడానికి ఎవరు ముందుకు వచ్చినా వారికి తెలుగుదేశం పార్టీ సహరిస్తుందని తెలియజేశారు.