మార్కాపురం జిల్లా మార్కాపురం మండలం జమ్మనపల్లి గ్రామ సమీపంలో వెలిసిన ముద్దసానమ్మ ఆలయంలో మౌని అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు పవన్ అమ్మవారికి విశేషంగా ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించి ప్రత్యేక అలంకరణ చేశారు. భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.