రామకుప్పం మండలంలోని విజిలాపురం KVB స్కూల్ కమిటీ ఛైర్మన్ భాగ్యలక్ష్మి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఉన్నిగానిపల్లికి చెందిన భాగ్యలక్ష్మి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం అత్యంత బాధాకరమని ఆర్టీసీ వైస్ ఛైర్మన్ మునిరత్నం పేర్కొన్నారు. టీడీపీ శ్రేణులతో కలిసి ఆయన భాగ్యలక్ష్మి భౌతిక కాయానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. భాగ్యలక్ష్మి కుటుంబానికి టీడీపీ అన్ని విధాలుగా అండగా ఉండి ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు.