జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు అనంతపురం రైల్వే స్టేషన్లో డాగ్ స్క్వాడ్‌తో విస్తృత తనిఖీలు చేపట్టారు. జిల్లాలోని రైలు మార్గం ద్వారా అక్రమ రవాణాను అరికట్టే చర్యల్లో భాగంగా శనివారం సాయంత్రం 6 గంటల సమయంలో తనిఖీలు నిర్వహించారు. ఇతర రాష్ట్రాలు మరియు ఇతర ప్రాంతాల నుండి వచ్చే రైళ్లు, అలాగే అనంతపురం రైల్వే స్టేషన్ మరియు రైల్వే పార్శిల్ కార్యాలయాలలో డాగ్ స్క్వాడ్ సహాయంతో అనంతపురం త్రీటౌన్ పోలీసులు సోదాలు చేపట్టారు. త్రీటౌన్ సి.ఐ. రాజేంద్రనాథ్ యాదవ్ పర్యవేక్షణలో ఎస్సై శరత్చంద్ర ఆధ్వర్యంలో ఈ తనిఖీలు కొనసాగించారు.