పెగడపల్లె: పెగడపల్లిలో ఘనంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు, నివాళులర్పించిన కాంగ్రెస్ శ్రేణులు
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశాల మేరకు పెగడపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏఎంసీ చైర్మన్ బుర్ర రాములు గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు వైఎస్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.