చందంపేట: దిండి ప్రాజెక్టు జలహారతి కార్యక్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బాలునాయక్, వంశీకృష్ణ
నల్లగొండ జిల్లా డిండి ప్రాజెక్టు అలుగు పోస్తున్న సందర్భంగా మంగళవారం డిండి ప్రాజెక్టు జల హారతి కార్యక్రమంలో దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ పాల్గొన్నారు.ఈ సందర్భంగా డిండి ప్రాజెక్ట్ ఆయకట్టు కింద రైతులకు సాగునీరు అందుతుందని కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు రైతులకు అండగా ఉంటుందన్నారు .కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టులన్ని నింపి రైతులకు సాగనీరు అందించడంలో ముందంజలో ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.