ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అభ్యర్థన మేరకు హైడ్రా కమిషనర్ రంగనాథ రామంతపూర్ చిన్న చెరువు, పెద్ద చెరువు ప్రాంతాలను పరిశీలించారు. చెరువు సుందరీ కరణ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు, మురికి నీరు చేరకుండా చర్యలు పలు అంశాలపై స్థానికులతో మాట్లాడారు. కాప్రా, నాచారం పరిధిలోని హెచ్ఎంటి నగర్ చెరువు పటేల్ కుంట పూడికతీతపై కూడా సమీక్షించారు. త్వరలో అన్ని చెరువులను సందర్శించి పనులు ప్రారంభిస్తామని కమిషనర్ తెలిపారు.