రాయదుర్గం: జిల్లాలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు గజదొంగలను అరెస్టు చేసిన రాయదుర్గం పోలీసులు
అనంతపురం జిల్లాలో పేరుమోసిన ఇద్దరు గజదొంగలను రాయదుర్గం పోలీసులు అరెస్టు చేశారు. రాయదుర్గం మండలంలోని 74 ఉడేగోళం గ్రామంలో పట్టపగలు ఓ మహిళ మెడలోని గోల్డ్ దొంగలించిన ఘటనను సీరియస్ గా తీసుకున్న పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి సాంకేతిక పరిజ్ఞానంంలో నిందితులను గుర్తించారు. సోమవారం గుండ్లపల్లి దగ్గర వీరిని అరెస్టు చేసినట్లు సిఐ జయనాయక్ తెలిపారు.