అసిఫాబాద్: మోతుగూడ గ్రామ సమీపంలో బైక్ అదుపు తప్పి బాలుడికి గాయాలు
బైక్ అదుపుతప్పి ఓ బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఆసిఫాబాద్ మండలం మోతుగూడ ఫ్లై ఓవర్ బ్రిడ్జి సమీపంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. ఆసిఫాబాద్‌కు చెందిన ఇద్దరు బైక్ పై రాంగ్ రూట్లో కాగజ్ నగర్ వైపు వెళ్తుండగా మోతుగూడ సమీపంలో బైక్ అదుపుతప్పి పడిపోయింది. ఈ ప్రమాదంలో ఓ బాలుడికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.