చీపురుపల్లి: జిల్లాకు చేరుకున్న వ్యయ ఎన్నికల పరిశీలకులు
జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు ప్రభాకర్ ప్రకాష్ రాజన్, ఆనంద్ కుమార్, ఆకాష్ దీప్ గురువారం సాయంత్రం జిల్లాకు చేరుకున్నారు. వీరిని జెడ్పీ అతిథి గృహం వద్ద జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, ఎస్పీ దీపిక మర్యాద పూర్వకంగా కలిశారు. జిల్లాలోని ఎన్నికల పరిస్థితిని, తీసుకున్న చర్యలను వివరించారు. వీరి వెంట లైజన్ ఆఫీసర్లు కూడా ఉన్నారు.