అసిఫాబాద్: డబ్బా గ్రామ పంచాయతీలో నిధులు దుర్వినియోగం, కలెక్టర్ కు పిర్యాదు చేసిన గ్రామస్థులు
చింతలమనేపల్లి డబ్బా గ్రామ పంచాయతీ పరిధిలో ప్రజలకు 381 మరుగుదొడ్లు మంజూరు కాగా అందులో 57.83లక్షలు నిధులు మంజూరు కాగా దాదాపు రూ.30 లక్షల బినామీల పేరుతో అవినీతికి మాజీ సర్పంచ్, కార్యదర్శి అక్రమాలకు పాల్పడినట్లు స్థానికుడు సంతోష్ ఆరోపించాడు. సోమవారం ASF కలెక్టర్ కు పిర్యాదు చేసి మాట్లాడారు.. డబ్బా గ్రామ పంచాయతీలో 381 మరుగుదొడ్లు మంజూరు కాగా అందులో కొందరికే మాత్రమే బిల్లులు చెల్లించారని మిగతా వారికి చెల్లించకుండా దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు.