చీమకుర్తి పట్టణంలో దివ్యాంగుల సమైక్య ఆధ్వర్యంలో బుధవారం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెప్మా జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీహరి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు ఆటల పోటీలను నిర్వహించారు. ఆటల పోటీలలో విజేతలైన దివ్యాంగులను మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీహరి ఘనంగా సన్మానించడంతోపాటు వారికి బహుమతి ప్రధానం చేశారు. దివ్యాంగుల ఆర్థిక అభివృద్ధి కోసం మెప్మా ద్వారా ప్రభుత్వం రుణాలను పంపిణీ చేస్తుందన్నారు. అర్హత గల దివ్యాంగులు మెప్మా ద్వారా అందించే రుణాలను పొంది అభివృద్ధి చెందాలని శ్రీహరి సూచించారు.