మెరుగైన ఫలితాల కోసం ఇంటర్మీడియట్ విద్యార్థులను తీర్చిదిద్దుతున్నామని మార్కాపురం జిల్లా రాచర్ల మండలంలోని ఏపీ మోడల్ స్కూల్ మరియు జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ మురళి అన్నారు. ఇంటర్మీడియట్ పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నామని వారికి ఇప్పటికే ఫ్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించినట్లు ఆదివారం తెలిపారు. వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని విద్యా శక్తి కార్యక్రమంలో భాగంగా ముందస్తు ఉన్నత చదువులపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. పరీక్షలు దగ్గర పడుతున్న నేపథ్యంలో రోజుకు 16 గంటల పాటు విద్యార్థులు చదువుకుంటున్నారని 985 మార్కులు సాధించే లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు.