చీపురుపల్లి: 24 న చీపురుపల్లి లో టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు కిమిడి కళావెంకట్రావు నామినేషన్
ఈ నెల 24 బుధవారం నాడు టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు మాజీ మంత్రి చీపురుపల్లి నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి కిమిడి కళావెంకట్రావు చీపురుపల్లి లో ఆర్డీవో కార్యాలయం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ మేరకు ముహూర్తం ఖరారు చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కిమిడి కళావెంకట్రావు టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు గా వ్యవహరిస్తున్నారు. కళా ఇప్పటి వరకు ఐదు సార్లు ఎమ్మెల్యేగా పని చేసి వివిధ శాఖల్లో మంత్రి గా పని చేసారు.