శ్రీకాకుళం: సమర్థవంతమైన పోలీసింగ్ విధానంతో నేరాలు ఘననీయంగా తగ్గుముఖం పట్టాయి: ఎస్పీ మహేశ్వరెడ్డి
జిల్లాలో పటిష్టమైన చర్యలు, సామర్ధవంతమైన పోలీసింగ్ విధానంతో 2024 లో నేరాలు ఘననీయంగా తగ్గుముఖం పట్టాయని జిల్లా ఎస్.పి మహేశ్వరెడ్డి వెళ్ళడించారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా పోలీస్ వార్షిక నేర ఘనాoఖాల నివేదికను జిల్లా ఎస్.పి విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గత ఏడాది కంటే 2024 వ సంవత్సరంలో 17% జిల్లాలో నేరాలు తగ్గు ముఖం పట్టాయని తెలిపారు. 2023 వ సంవత్సరంలో 11017 కేసులు నమోదు కాగా 2024 వ సంవత్సరంలో 9434 కేసులు నమోదయ్యాయని జిల్లా ఎస్.పి తెలియజేశారు.