ధర్మారం: ఘనంగా బొడ్డెమ్మ వేడుకలు. అల్లరించిన నృత్యాలు...
జగిత్యాల జిల్లా ధర్మపురి పుణ్యక్షేత్రంలోనీ బ్రాహ్మణవీధిలో శనివారం రాత్రి మహిళలు బొడ్డెమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు.స్థానిక పెద్దంభట్ల వారివీధి తోపాటు,బొజ్జవారి వీధుల్లో ప్రతియేటా పొలాల అమావాస్య నుండి జేస్ట్యా దేవిగా పిలిచే బొడ్డెమ్మను మట్టితో తయారుచేసి మహిళలు ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ తర్వాత ముగింపు వేడుకల్లో భాగంగా మహిళలు బొడ్డెమ్మను నూతన వస్త్రాలతోపాటు అభరణలతో అలంకరించి,కోలాట నృత్యాలు,ఆటపాటల మధ్య గోదావరినది వరకు పురవీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు.అనంతరం గోదావరిలో బొడ్డెమ్మను నిమజ్జనం చేసి తమ భక్తిని చాటుకున్నారు.