సామాజిక న్యాయం కోసం సూళ్లూరుపేటలో గళమెత్తిన AITUC–CPI నాయకులు
సామాజిక న్యాయం, సమానత్వం, ఆత్మగౌరవం కోసం కులగణన తప్పనిసరి అని డిమాండ్ చేస్తూ AITUC–CPI నాయకులు సూళ్లూరుపేటలో గళమెత్తారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలో మంగళవారం ఏఐటీయూసీ సిపిఐ నాయకులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ప్లకార్డులు చేతబట్టి తమ డిమాండ్లను తెలియజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే కులగణన ప్రారంభించాల్సిన అవసరాన్ని స్పష్టం చేశారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిజమైన డేటాతో సామాజిక న్యాయం సాధించాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు.