కామారెడ్డి: రహదారి ప్రమాదాలను నివారించి ప్రాణనష్టం కలగకుండా చూడాలి:పట్టణంలో జిల్లా కలెక్టర్ అశిష్ సంగ్వాన్
రహదారి ప్రమాదాలను నివారించి జిల్లాలో ప్రాణ నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు.గురువారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన రహదారుల భద్రతా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రహదారి భద్రత నియమాలను పాటిస్తే చాలావరకు రోడ్డు ప్రమాదాలను నివారించగలుగుతామని ప్రజల్లో రహదారుల పై సురక్షిత ప్రయాణం గురించి పై అవగాహన పెంపొందించాలని, అవసరమైన ప్రాంతాలలో సూచన బోర్డులను తప్పక ఏర్పాటు చేయాలని తెలిపారు