గిద్దలూరు: కంభం చెరువు కట్టపై ద్విచక్ర వాహనంపై అధిక మొత్తంలో ప్రయాణిస్తున్న యువకులకు కౌన్సిలింగ్ ఇచ్చిన ఎస్ఐ శివకృష్ణారెడ్డి
నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనంపై ముగ్గురు అంతకుమించి ప్రయాణించడం చట్టరీత్య నేరమని కంభం ఎస్ఐ శివకృష్ణారెడ్డి యువకులను హెచ్చరించారు. సోమవారం పట్టణంలోని కంభం చెరువు కట్టను సందర్శించిన ఎస్ఐ చెరువుకు ద్విచక్ర వాహనంపై వస్తున్న ముగ్గురు యువకులకు కౌన్సిల్ ఇవ్వడంతో పాటు చెరువు కట్టపై ఉన్న యువకులకు కౌన్సిలింగ్ ఇచ్చి వార్నింగ్ ఇచ్చారు. ద్విచక్ర వాహనం నడిపే ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలని ఇద్దరు మించి ద్విచక్ర వాహనంపై ప్రయాణించే రాదని తెలిపారు.