రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న DDR కార్యాలయాలను చిత్తూరులో డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ వర్చువల్గా ప్రారంభించారు. కుప్పంలో DDR కార్యాలయాన్ని ఆర్టీసీ వైస్ ఛైర్మన్ మునిరత్నం, TTD బోర్డు సభ్యుడు శాంతారాం ప్రారంభించారు. ఈ కార్యాలయంతో ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత చేరువ అవుతాయన్నారు. గ్రామీణాభివృద్ధి శాఖల మధ్య సమన్వయం, ప్రజా సమస్యల పరిష్కారానికి సంబంధించిన పరిపాలన కార్యకలాపాలు సులభతరం అవుతాయని పేర్కొన్నారు.