ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో జరిగిన మీకోసం కార్యక్రమంలో ఎస్పీకి 61 అర్జీలు వచ్చినట్లు నిర్వహణ అధికారులు వెల్లడి
Ongole Urban, Prakasam | Mar 30, 2026
ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమంలో 61 ఫిర్యాదులు అందినట్లుగా ఎస్పీ కార్యాలయ నిర్వహణ అధికారులు ప్రకటించారు. సోమవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగిన కార్యక్రమంలో జిల్లాల నుంచి పలువురు ఎస్పీని కలిసి తమ సమస్యలపై అర్జీలు ఇచ్చారు. వచ్చిన అర్జీలు అన్నిటిని పరిశీలించి ఎస్పీ పరిష్కరిస్తారని అర్జీదారులకు హామీ ఇచ్చినట్లు అధికారులు వెల్లడించారు.