రామకుప్పం మండలంలోని పంచాయతీ కేంద్రమైన నారాయణపురం తండాలో రోడ్డు లేకపోవడంతో గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు మట్టి రోడ్డు కాస్త మురుగునీటి కుంటను తలపిస్తోందని.. ఇదే మార్గంలో గ్రామానికి నిత్యం రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి ఉందని ప్రజలు తెలిపారు. రోడ్డు వసతి కల్పించాలని గ్రామస్థులు కోరుతున్నారు.