తొమ్మిది రోజులు గుండిచా మందిరంలో పూజలు అందుకున్న జగన్నాథుడు నేడు తిరిగి రథంలో తన గూటికి చేరుకున్నారు. పలాస మండలం తర్లకోట, రైల్వే కాలనీ లో జరిగిన ఈ రథయాత్రలో వేలాదిమంది భక్తులు పాల్గొన్నారు. పలాస రైల్వే కాలనీ ఆవరణంలో తొమ్మిది రోజులపాటు అంగరంగ వైభవంగా నిర్వహించిన జగన్నాధుని రథయాత్ర శనివారము రాత్రి ముగిసింది. మరోవైపు తర్లకోటలో రాజులు కాలం నుంచి వందలాది సంవత్సరాలుగా పూజలందుకున్న జగన్నాధుని రథయాత్రలో కనీసం భక్తజనులు లేక వెలవెల బోయింది.