అసిఫాబాద్: ఆసిఫాబాద్ జిల్లాలో సింగిల్ డిజిట్ కు పడిపోయిన ఉష్ణోగ్రతలు
ఆసిఫాబాద్ జిల్లాలో రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పడిపోయి చలి తీవ్రత తీవ్రంగా పెరుగుతోంది. ఆసిఫాబాద్ జిల్లాలోని 15 మండలాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా బుధవారం సిర్పూర్(యు)లో 9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. జైనూర్, కెరమెరి ఏజెన్సీ గ్రామాల్లో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలుగా నమోదయ్యాయి. చలి తీవ్రత కారణంగా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి ఇబ్బంది పడుతున్నారు.