వెల్గటూరు: ఉచిత వైద్య పరీక్షలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలి - మండల వైద్యాధికారి తేజ శ్రీ...
జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల వైద్యాధికారి తేజశ్రీ అద్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టగా, మహిళల నుండి విశేష స్పందన లభించింది. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి పలు రకాల వైద్య పరిక్షలు చేయించుకున్నారు. ఈ సందర్బంగా డాక్టర్ తేజశ్రీ మాట్లాడుతూ. కేంద్ర ప్రభుత్వం మహిళల ఆరోగ్యం కోసం 15 రోజుల పాటు ప్రత్యేక ఆరోగ్య పరిక్షలు చేయడం జరుగుతుందని తెలిపారు.