భీమిలి: వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలంటూ
ప్రజారోగ్య కార్మికులు నిరసన.
జీవిఎంసి ప్రజారోగ్య విభాగంలో పారిశుధ్య కార్మికులుగా పని చేస్తూ వివిధ కారణాలతో నిలిచిపోయిన, మరణించిన కార్మికుల వారసులకు ఆప్కాస్ ఉద్యోగాలు వెంటనే ఇవ్వాలని మున్సిపల్ కార్మికులు సి ఐ టీ యు ఆధ్వర్యంలో జోనల్ కార్యాలయం వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. పని చేస్తూ మరణించిన, అనారోగ్యంతో బాధపడుతున్న వారు,60 సంవత్సరాలు నిండి ఉద్యోగాలనుండి తోగించిన వారి వారసులకు ఇస్తామన్నా ఉద్యోగాలు సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ ఇవ్వక పోవదం అన్యాయమని సి ఐ టీ యు నాయకులు డీ అప్పలరాజు, వి నరేంద్ర కుమార్ అన్నారు. అనారోగ్యంతో బాధపడుతూ దీర్ఘ కాలం సెలవులలో ఉన్న కార్మికులను విధులలోకి తీసుకోలేదని తెలిపారు.