మేడ్చల్: నియోజకవర్గ వ్యాప్తంగా భారీ వర్షం, షామీర్పేట మండలం తుర్కపల్లి గ్రామంలో నేలకొరిగిన భారీ వృక్షం
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా లో గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది మూడు చింతలపల్లి మండలం లక్మాపూర్, ఉద్యమరి పలు గ్రామాలలో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది శామీర్పేట మండలం తుర్కపల్లి చౌరస్తాలోని ఎస్సీ కమ్యూనిటీ హాల్ వద్ద ఉన్న భారీ వృక్షం గాలివానకు నేలకొరిగింది ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది చెట్టు కింద ఉన్న పలు ద్విచక్ర వాహనాలు స్వల్పంగా ధ్వంసం అయ్యాయి