డి.హిరేహాల్ మండలంలోని చెర్లోపల్లి గ్రామానికి చెందిన రుద్రమ్మ (26) అనే మహిళ అదృశ్యమైంది. మానసిక సమస్యతో బాధపడుతున్న ఆమె కొన్నిరోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. పోలీసులకు పిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆమె ఆచూకీ తెలిస్తే 7702377134 నంబరుకు సమాచారం ఇవ్వాలని కుటుంబ సభ్యులు కోరారు.