కొత్తగూడెం: జిల్లాలో గణేష్ మండపాల ఏర్పాటుకు అనుమతులు తప్పనిసరి: ఎస్పీ రోహిత్ రాజ్
గణేష్ మండపాల ఏర్పాటు, ఉత్సవాల నిర్వహణకు సంబంధిత సబ్ డివిజనల్ పోలీసు అధికారి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వినాయక చవితిఉత్సవాలు నిర్వహించే నిర్వాహకులు నిబంధనలు పాటించాలని కోరారు. డీఎస్పీ కార్యాలయంలో అనుమతులకు దరఖాస్తు పెట్టేముందు దరఖాస్తుతోపాటు మునిసి పాలిటీ లేదా పంచాయతీ, అగ్నిమాపక, విద్యుత్ అధికారులు ఇచ్చిన అనుమతులు తప్పనిసరిగా జతచేయాలని పేర్కొన్నారు. నిర్వాహకులు ప్రతిమ ఎత్తు, నిమజ్జనం తేదీ, నిమజ్జనం చేస్తున్న ప్రదేశం వివరాలను https://policeportal.tspolice.gov.in సైట్ లో తెలపాలన్నారు